న్యూస్‌రీల్
ఒక్కొక్కరికి ఒక లడ్డూ బాక్స్ మాత్రమే నేడు కూడా రద్దీ కొనసాగే అవకాశం వీఐపీ, సిఫార్సులు రద్దు
ఒక్కో భవానీకి
ఒకటే లడ్డూ బాక్స్
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఇంద్రకీలాద్రికి కొనసాగుతున్న భవానీల రద్దీ
జగ్గయ్యపేట అర్బన్: కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి శనివారం జగ్గయ్యపేట సబ్ జైలును సందర్శించారు. వసతి సౌకర్యాలు, ఆహారం, భద్రత తదితర అంశాలను పరిశీలించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల అనంతరం భవానీల రద్దీ కొనసాగుతోంది. శనివారం కూడా రికార్డు స్థాయిలో భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీక్షతో ఇరుముడులను ధరించి ఇంద్ర కీలాద్రికి తరలివచ్చిన భవానీల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహా మండపం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇరుముడి సమర్పణ కౌంటర్లు ఏర్పాటు చేసింది.
కిటకిటలాడిన క్యూలైన్లు
వినాయకుడి గుడి క్యూలైన్లతో పాటు కుమ్మరిపాలెం క్యూలైన్లు భవానీ భక్తులతో కిటకిటలాడాయి. రద్దీ నేపథ్యంలో అన్ని దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేసిన దేవస్థానం రూ.100, రూ.300 క్యూలైన్లలో సైతం ఉచిత దర్శనానికి అనుమతించారు. ఆదివారం కూడా భవానీల రద్దీ కొనసాగే అవకాశం ఉందని, అందువలన ఆదివారం కూడా వీఐపీ, సిఫార్సులపై వచ్చే వారికి ఎటువంటి ప్రత్యేక దర్శనాలు కల్పించలేమని ఆలయ అధికారులు ప్రకటించారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచే భవానీలు, భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఉదయం 8 గంటల వరకు భవానీల తాకిడి అధికంగా కనిపించింది. భవానీల రద్దీ నేపథ్యంలో క్యూలైన్లు మినహా ఇతర మార్గాల నుంచి భక్తులు, భవానీలెవరినీ కొండపైకి అనుమతించలేదు. 9 గంటల తర్వాత కొంత మేర రద్దీ సాధారణంగా కనిపించినా, మధ్యాహ్నం తర్వాత మళ్లీ పెరిగింది. ఆదివారం సాయంత్రం నాటికి రద్దీ సాధారణ స్థితికి వస్తుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు శనివారం నుంచి రిలీవ్ అవుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.
ఎరుపెక్కిన స్నానఘాట్లు, కెనాల్‌రోడ్డు
అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భవానీలతో దుర్గగుడి పరిసరాలు ఎరుపెక్కాయి. ముఖ్యంగా స్నానఘాట్‌తో పాటు అమ్మవారి ఆలయానికి చేరుకునే క్యూలైన్ మార్గాలు, కొండ దిగువన అన్న ప్రసాద వితరణ కేంద్రం, లడ్డూ ప్రసాద కౌంటర్లు, కెనాల్‌రోడ్డులో ఎక్కడ చూసినా భవానీలే దర్శనమిస్తున్నారు. భవానీల రాకతో కెనాల్‌రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్, బీఆర్‌టీఎస్ రోడ్డులో సందడి వాతావరణం కనిపించింది.
దసరా ఉత్సవాల అనంతరం భవానీల రద్దీ కొనసాగుతుండటంతో లడ్డూ కొరత ఏర్పడింది. ఈ దసరా ఉత్సవాలలో శనివారం నాటికి 40 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం సిబ్బంది భక్తులు, భవానీలకు అందించారు. రోజుకు సుమారు 2 లక్షల లడ్డూలను మూడు పోటులలో తయారు చేస్తుండగా, తయారు చేసిన లడ్డూలను తయారు చేసినట్లే కౌంటర్లకు పంపు తున్నారు. భవానీల నుంచి లడ్డూలకు అధిక డిమాండ్ వస్తుండటంతో భక్తులందరికీ లడ్డూలను అందించాలనే భావనతో ఒక్కొక్కరికి ఆరు లడ్డూలు ఉన్న ఒక బాక్స్‌ను మాత్రమే ఇస్తున్నారు. దీంతో భవానీల వెంట వచ్చిన సాధారణ భక్తులు సైతం లడ్డూల కోసం క్యూలైన్‌లోకి విచ్చేస్తున్నారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచే లడ్డూల కోసం భవానీలు, భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండటం కనిపించింది.