
● సప్త వర్ణ శోభితం
ప్రకృతి రమణీయమైనది. సాయంసంధ్య వేళల్లో ప్రకృతి అందాలను చూస్తే ఎవరైనా సరే మైమరచిపోవలసిందే. నగర జీవి బిజీ బతుకుల్లో పట్టించుకోవడం లేదు కాని...కాస్త తీరిక చేసుకుని ప్రకృతి వైపు ఓసారి కన్నేసి తిలకిస్తే అలసి సొలసిన మనసుకు ఆహ్లాదంతో పాటు మానసిక ప్రశాంతత లభించడం ఖాయం. శనివారం విజయవాడ కరకట్ట శివారులో సూర్యాస్తమ సమయాన కనిపించిన ఈ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
ఇబ్రహీంపట్నం: పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్యార్మీ షరీఫ్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌసే ఆజం చిహ్నమైన జెండాను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల నడుమ ఊరేగింపు చేశారు. పండగ సందర్భంగా ఈనెల 10వ తేదీన మసీదు వద్ద భారీ అన్నదానం నిర్వహిస్తున్నట్లు మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా తెలిపారు. కార్యక్రమంలో మసీదు కమిటీ కోశాధికారి కరీముల్లా, హసన్ అహ్మద్, షేక్ దావూద్, షేక్ గోరే, అలీఖాన్, కరిముల్లా ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో గ్యార్మీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు

● సప్త వర్ణ శోభితం

● సప్త వర్ణ శోభితం

● సప్త వర్ణ శోభితం