
స్థిరంగా సాగుతున్న వరద ప్రవాహం
కంకిపాడు: ఏటిపాయలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం వరద తగ్గుముఖం పట్టినా ప్రవాహం అలాగే ఉంది. ప్రస్తుతం మద్దూరు, కాసరనేనివారిపాలెం వద్ద ఏటిపాయ అంచులు తాకుతూ వరదనీరు ప్రవహిస్తోంది. ఏటిపాయలోని లంక భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు, కూలీలు పడవలను ఆశ్రయిస్తున్నారు. పడవలపై పొలాలకు వెళ్లి పొలం పనులు పూర్తి చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఏటిపాయ లో కొనసాగుతున్న వరద ఉధృతికి పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. మద్దూరు, కాసరనేనివారిపాలెం పరిధిలోని ఏటిపాయ వెంబడి లంక భూముల్లోకి చేరిన వరదనీరు ఇంకా పొలాల్లోనే ఉండిపోయింది. ప్రవాహం కొనసాగుతున్న కారణంగా పొలాల్లో ఉన్న వరదనీరు ఏటిపాయకు మళ్లటం లేదు. దీంతో పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికి అందుతాయో? లేదో? అన్న భయం రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది.

స్థిరంగా సాగుతున్న వరద ప్రవాహం