
ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ శిబిరం
ఉయ్యూరు: ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థల ఆఽవరణలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ వార్షిక శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 17వ ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సీసీ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో క్యాడెట్లకు బంకర్ బ్లాస్టింగ్, ఫీల్డ్ క్రా్‌ఫ్ట్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్ట్, ఫైరింగ్ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. 619 మంది క్యాడెట్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఎన్‌సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెప్ట్‌నెంట్ కల్నల్ జీసీ పాండే క్యాడెట్లకు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆపరేషన్ సింధూర్, జవాన్ల పాత్రపై అవగాహన కల్పించారు.