
రెడ్‌క్రాస్ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) కృష్ణా జిల్లా శాఖను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఐఆర్‌సీఎస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనంట్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన కమిటీకి డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్‌ను చైర్మన్‌గా, సిర్విశెట్టి భాస్కర్‌ను వైస్ చైర్మన్‌గా, దాసరి రామకృష్ణ, వి.సుందర్ రామ్, జి.మెహర్ ప్రసాద్, పి.సుకుమార్, ఎన్.లీలా బ్రహ్మేంద్ర, బి.శివ విష్ణువర్ధన్, టి.వీరేంద్రనాథ్, బి.వెంకటేశ్వరరావు, బి.శంకర్‌నాథ్, పి.రాంప్రసాద్ సభ్యులుగా, డాక్టర్ ఎం.సూర్యశేఖర్, డాక్టర్ ఎస్.శర్మిష్ఠ, పి.వెంకట సుబ్బారావు, జె.బాబూరావులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ అబ్జర్వర్ రామచంద్ర రాజు, జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, రెడ్ క్రాస్ ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్, జీవిత సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.