
జాతీయ కబడ్డీ పోటీలకు కృష్ణా వర్సిటీ జట్టు
మైలవరం: జాతీయ కబడ్డీ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అంతర్ కళాశాలల కబడ్డీ పోటీల ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇళ్ళ రవి శుక్రవారం తెలిపారు. గత వారం స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ పురుషుల అంతర్ కళాశాల కబడ్డీ పోటీల నుంచి మెరుగైన క్రీడాకారులను కృష్ణా విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపిక చేశామన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం జట్టు కర్నాటకలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీ బెల్లావిలో ఈ నెల 4 నుంచి 7 వరకు నిర్వహించే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో పాల్గొంటుందన్నారు. ఈ పోటీలను నాక్ ఔట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు కృష్ణా వర్సిటీ జట్టుకు మేనేజర్‌గా మైలవరం లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామిని, కోచ్‌గా నలంద కళాశాలకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావును, టీమ్ కెప్టెన్‌గా శ్యామ్ కుమార్‌ను నియమించినట్టు తెలిపారు. జట్టు సభ్యులుగా విజయ వ్యాయామ కళాశాల నుంచి శ్యామ్‌కుమార్, సాయి ప్రసన్న, వెంకటేశ్వర్లు, సిద్ధార్థ కళాశాల నుంచి మహేష్, మధు, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి శామ్యూల్ రాజ్, కిరణ్, కేబీఎన్ కళాశాల నుంచి ఫిరోజ్, తేజ, ఎల్‌హెచ్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అజయ్‌బాబు, నలంద కళాశాల నుంచి యశ్వంత్ కుమార్, ఏజీఎస్‌జీఎస్ కళాశాల నుంచి గోపీచంద్, వికాస్ కళాశాల నుంచి వెంకటేశ్వరరావు, లయోలా కళాశాల నుంచి మహేష్ ఎంపికయ్యారన్నారు.