
బందరుకోట, గిలకలదిండి అభివృద్ధికి కృషి
మచిలీపట్నంటౌన్: నగరంలోని బందరుకోట, గిలకలదిండి ప్రాంతాల్లో దశలవారీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 21వ డివిజన్ బందరుకోట శ్రీ కోదండరామస్వామి, హనుమాన్ టెంపుల్ సమీపంలో రూ.30 లక్షలతో మూడు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, 20వ డివిజన్ గిలకలదిండిలో రూ. 10 లక్షల వ్యయంతో ఓవర్‌హెడ్ ఆవరణకు ప్రహరీ నిర్మాణం పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోర్టు నిర్మాణం పూర్తికానున్న నేపథ్యంలో నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ ప్రక్షాళన, రహదారుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. బందరుకోటలో మరో ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ మెంబరు లంకే నారాయణప్రసాద్, మునిసిపల్ మాజీ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, గిలకలదిండి, బందరు కోట టీడీపీ ఇన్‌చార్జ్‌లు రమేష్, అనిల్, నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, ప్రభుత్వాసుపత్రి మాజీ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.