
మచిలీపట్నంలో మహిళ ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నం మండలం పెదయాదర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబంపై ఆదివారం జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారు. అవమానం తట్టుకోలేని టీడీపీ కార్యకర్త భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మ హత్యకు ప్రయత్నించింది. వివరాలిలా ఉన్నాయి. పెదయాదర గ్రామానికి చెందిన పంచాయతీ చెరువును అభివృద్ధి చేసేందుకు ఆ ఊరి సర్పంచ్‌తో పాటు ఇతర పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే చెరువు అభివృద్ధి పనుల పేరుతో రూ.లక్షల ఖరీదు చేసే అక్కడి మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తుంగల నరసింహారావు గ్రామ సర్పంచ్, జనసేన నాయకుడు గల్లా తిమోతీకి మధ్య అనేక మార్లు వాదన జరిగింది. కళ్లెదుట జరుగుతున్న అవినీతిని భరించలేని నరసింహారావుతో పాటు గ్రామానికి చెందిన మరి కొంతమంది టీడీపీ కార్యకర్తలు కలిసి మీ–కోసంలో జనసేన నాయకుల అవి నీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో గల్లా తిమోతీ అవినీతి అక్రమాలపై టీడీపీ కార్యకర్త నరసింహారావు కోర్టులో ప్రైవేటు కేసు వేశారు.
తెలుగుతమ్ముడి ఇంటిపై దాడి
నరసింహారావు వేసిన ప్రైవేటు కేసుకు సంబంధించి తిమోతీతో పాటు మరి కొంతమంది పంచాయతీ సభ్యులకు నోటీసులు అందాయి. దీంతో తిమోతీ ఆదేశాల మేరకు అతని అనుచరులైన శేషాద్రి వాసుపవన్, గల్లా లక్ష్మణ, కంచర్లపల్లి కోదండరామారావు ఆదివారం నరసింహారావుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం నరసింహారావు ఇంట్లో లేని సమయం చూసి అతని భార్య సత్యవతితో జనసేన నాయకులు గొడవకు దిగారు. ఇంట్లో తన భర్త లేడని చెబుతున్నా వినకుండా నరసింహారావుతో పాటు అతని భార్యను నానా మాటలతో అవమానించారు. సత్యవతిపై దాడి చేసేందుకు సైతం తెగించారు. అవమానాన్ని తట్టుకోలేని సత్యవతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసు పత్రికి తరలించటంతో సత్యవతి ప్రాణాలతో బయటపడింది. బందరు రూరల్ పోలీసులు బాధితురాలు సత్యవతి నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
జనసేన నాయకుల బెదిరింపులే కారణం
బాధితురాలు టీడీపీ కార్యకర్త భార్య