
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
కంచికచర్ల: వేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహ నాన్ని ఢీకొనగా ఒక వ్యక్తి మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గా యాలయ్యాయి. ఈ ఘటన కంచికచర్లలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న కారు కంచికచర్ల ఫ్‌లైఓవర్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ఘటనలో కారులో వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్‌కు చెందిన వట్టికూటి చలపతిరావు(45) అక్కడికక్కడే మృతిచెందారు. విజయవాడకు చెందిన కారు డ్రైవర్ విశ్వనాథపల్లి గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.