
ముగిసిన కబడ్డీ పోటీలు
మైలవరం:లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్శిటీ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోటీలు నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళ రవి తెలిపారు. లీగ్ మ్యాచ్‌లలో గెలిచిన విజయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొదటి స్థానంలో ఉండగా, రెండు విజయాలతో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో స్థానం, ఒక విజయంతో పీబీ సిద్ధార్థ కళాశాల విజయవాడ మూడో స్థానం, కేబీఎన్ కళాశాల నాలుగో స్థానాన్ని పొందాయని చెప్పారు. ఈ టోర్నమెంట్ నుంచి సౌత్ ఇండియా దక్షిణ భారత పురుషుల అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపిక చేస్తామని సెక్రటరీ టోర్నమెంట్ అర్గనైజర్ మేజర్ మన్నే స్వామి తెలిపారు. సౌత్ ఇండియా పోటీలను కర్ణాటకలోని బెల్గావ్ నందు రాణి చెన్నమ్మ యూనివర్శిటీలో వచ్చే నెల 4నుంచి 7 వరకు నిర్వహిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కబడ్డీ సెలక్షన్ కమిటీ మెంబర్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి ఇతర కళాశాలల ఫిజికల్ డైరెక్టర్‌లు పాల్గొంటారన్నారు.