ఖమ్మంఅర్బన్: Æð‡¯éÌŒæt çÜ…çܦ Mö™èl¢ Ððl*yýlÌŒæ yýlçÜtÆŠ‡ M>Æý‡$¯]l$ QÐ]l$Ã… Ð]l*Æð‡P-sŒæ-ÌZMìS Ñyýl$-§ýlÌS ^ólíÜ…¨. D çÜ…§ýl-Æý‡Â…V> BÆ>P Æð‡¯éÌŒæt ÚùÆý‡*…ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… AíÜ-òÜt…sŒæ Ððl*sêÆŠ‡ Ððlíßæ-MýSÌŒæ C¯ŒS-òܵ-MýStÆý‡$Ï ¨¯ólÔŒæ, Æý‡Ñ^èl…{§ýl M>Æý‡$¯]l$ BÑçÙP-Ç…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… ÚùÆý‡*… õÜÌŒæÞ òßæyŠæ ¯]lÒ¯ŒS-M>…™Œæ ¯]l*Å Æð‡¯éÌŒæt yýlçÜtÆŠ‡ {ç³™ólÅ-MýS-™èl-ÌS¯]l$ ÑÐ]l-Ç…^éÆý‡$. B«§ýl$-°MýS Ýë…MóS-†MýS™èl, BMýS-Æý‡Û-×îæ-Ķæ$-OÐðl$¯]l yìlOgñ毌S-™ø Ðéçßæ¯]l… Æý‡*´÷…¨…_-¯]lr$Ï ™ðlÍ´ëÆý‡$. ¿êÆý‡™Œæ, BÆ>P {VýS*‹³ O^ðlÆý‡Ã¯ŒS MóSÝë çÜ$¿ê‹Ù ^èl…{§ýl-»Z‹Ü, BÆ>P çßZ…yé iG… Ððl…MýS-sôæ-ÔèæÓ-Æý‡-Æ>Ð]l#, ÚùÆý‡*… Ķæ*fÐ]l*-¯]lÅ… MóSÝë çÜ…ç³™Œæ, §éçÜÇ çÜÓÆ>gŒæ, VýS$Æý‡$-MìS-çÙ¯ŒS ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘
‘ప్రశ్నించే వారిని బంధించే యత్నంలో కేంద్రం’
ఖమ్మంమయూరిసెంటర్: ప్రశ్నించే వారిని నిర్బంధిస్తూ వారి గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామిక వాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిపిస్తోందని తెలిపారు. మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును ఎన్‌ఐఏ విచారణకు పిలవడం ప్రజాస్వామికవాదుల గొంతు నొక్కడమేనని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రభుత్వ చట్టవ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తమ కర్తవ్యమని తెలిపారు. ఈ క్రమాన సుదీర్ఘ కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానంలో బెదిరింపులు, నిర్బంధాలను చవిచూసినప్పటికీ అకారణంగా ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించడం మాత్రం మోదీ హయాంలోనే చూస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పోటు రంగారావుపై ఎన్‌ఐఏ కేసు ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ డిమాండ్ చేశారు.
నైటింగేల్ స్ఫూర్తితో సేవలు అందించాలి
సత్తుపల్లి: నర్సింగ్ పూర్తి చేయనున్న విద్యార్థి నులు ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో వైద్య సేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌గౌడ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎండీ రెహానాబేగం సూచించారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థినుల ‘ల్యాంప్ లైటింగ్ సెరిమొనీ’శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం ఇటీవల అవార్డులు అందుకున్న గంగారం పీహెచ్‌సీ వైద్యాధికారి ఆర్.అవినాష్, పెనుబల్లి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఎన్.కిరణ్‌కుమార్‌ను సన్మానించగా, ప్రతిభ చూపిన నర్సింగ్ విద్యార్థులకు బహుమతులు అందించారు. సత్తుపల్లి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్‌నారాయణ్, డాక్టర్ స్రవంతి, ఎన్‌ఎస్ రాధాకృష్ణకుమారి, హైమావతి, ప్రిన్సిపాల్ కేవీ జ్యోత్స్న, కౌన్సిలర్లు వీరివాడ అపర్ణ, విజయ్‌కుమారి, మానస, ఉష పాల్గొన్నారు.
చెరువు రిటైనింగ్ వాల్‌కు రూ.3 కోట్లు
బోనకల్: మండలంలోని ఆళ్లపాడు ఊరచెరువు ప్రధాన రహదారి పక్కన ఉండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన చెరువులో పడి పలువురు మృతి చెందారు. దీంతో చెరువుకు రిటైనింగ్ వాల్ నిర్మించేలా ప్రభుత్వం రూ.3 కోట్లను మంజూరు చేసింది. మార్కెట్ డైరెక్టర్ కందుల పాపారావు, కాంగ్రెస్ నాయకులు చెరువును శుక్రవారం పరిశీలించారు. నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుదాఘాతంతో
మృతి
పెనుబల్లి: మండలం పాత అగ్రహారానికి చెందిన మూడే బిక్షు(70) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆయన ఇంట్లో కరెంట్ మోటార్ స్విచాన్ చేయగా పైపులైన్ లీకేజీ అయింది. దీంతో ఇనుప పైపునకు గుడ్డ చుట్టే క్రమాన షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు మాజీ సర్పంచ్ సోమ్లానాయక్‌తో పాటు మరో కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


