
తప్పిన పెనుప్రమాదం
ముదిగొండ: ప్రభుత్వపాఠశాల ఆవరణలో పిడుగు పడగా.. ఆ సమ యాన విద్యార్థులెవరూ సమీపాన లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురంలో ఉన్న ముత్తారం హైస్కూల్ ఆవరణలోని గిన్నెచెట్టు పై సోమవారం సాయంత్రం వర్షం కురుస్తుండగా పిడుగు పడింది. భారీగా శబ్ధం రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కిపడగా ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పిడుగుపాడుతో చెట్టు నిట్టనిలువునా చీలిపోయింది.
దాడి ఘటనలో ముగ్గురిపై కేసు
చింతకాని: ఏపీఎస్‌పీ మూడో బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబసభ్యులపై దాడి చేసిన ఘటనలో చింతకాని మండలం పాతర్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన దిలీప్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశా రు. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన కానిస్టేబుల్ కట్టెకోల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి కారులో పెనుగంచిప్రోలులోని శ్రీలక్ష్మీతిరుపతమ్మ తల్లి దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆదివారం రాత్రి నాగులవంచలో దిలీప్ సహా ముగ్గురు ద్విచక్ర వాహనాన్ని అడ్డుగా పెట్టి కారు నిలిపివేశారు. ఆపై కారులో ఉన్న కవిత, సంగీత, సందీప్, సునీతపై దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా వారి సెల్‌ఫోన్లను పగులగొట్టి చంపుతామని బెదిరించారు. దీంతో కవిత ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.
పిడుగుపాటుతో చీలిపోయిన చెట్టు