
57 ఏళ్ల వయస్సు.. 41ఏళ్ల స్నేహం !
తల్లాడ: వారంతా తల్లాడ మండలం కుర్నవల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 1983–84 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు.. ప్రస్తుతం అందరి వయస్సు దాదాపు 57ఏళ్లు. ఇన్నాళ్ల తర్వాత ఇదే బ్యాచ్‌కు చెందిన యన్నం శ్రీనివాసరెడ్డి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. చదువు నేర్పిన గురువులను సైతం ఆహ్వానించి ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఏర్పాటుచేశారు. వృత్తి, ఉద్యోగాలు, ఆరోగ్యంతో పాటు పిల్లల ఎదుగుదల వివరాలు పరస్పరం తెలుసుకుంటూ రోజంతా సందడిగా గడిపారు. ఆపై గురువులను సన్మానించి త్వరలోనే మళ్లీ కలవాలని నిర్ణయించుకుని బరువైన హృదయాలతో వెనుదిరిగారు.