
స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలి
ఖమ్మం మామిళ్లగూడెం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి ప్రతీ గ్రామంలో కాషా య జెండా ఎగరేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమవుతుందనే అంశంపై అవగాహన కల్పించాలని సూ చించారు. ఇదే సమయాన రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గంట్యాల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, సన్నె ఉదయప్రతాప్, మందడపు సుబ్బారావు, నున్నా రవికుమార్, పుల్లారావు యాదవ్, డాక్టర్ శీలం పాపారావు, రామలింగేశ్వరరావు, వీరెల్లి రాజేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.