
విద్యుత్ సబ్ స్టేషన్‌లో నూతన బ్రేకర్
మధిర: సిరిపురం విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన నూతన బ్రేకర్‌ను విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి శనివారం ప్రారంభించారు. సిరిపురం సబ్‌స్టేషన్ లిఫ్ట్ ఫీడర్ నుంచి సిరిపురం లిఫ్ట్‌కు, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను, ప్రత్యామ్నాయంగా కలకోట, సిరిపురం లిఫ్ట్ ఫీడర్లుగా విడదీస్తూ సుమారు రూ.8 లక్షల వ్యయంతో నూత న బ్రేకర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఒకే బ్రేకర్ మీద సిరిపురం లిఫ్ట్‌కు, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను ప్రత్యామ్నాయ నూతన బ్రేకర్ ఏర్పాటుతో ఈ రెండింటినీ విడదీసి అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ డీఈ బండి శ్రీనివాసరావు, మధిర సబ్ డివిజన్ ఏడీఈ ఎం.అనురాధ, రూరల్ సెక్షన్ ఏఈ మైథిలి పాల్గొన్నారు.
యోగా ఆశ్రమం
అభినందనీయం
ఏన్కూరు: ప్రకృతితో మమేకమై ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా కేంద్రం ఏర్పా టు చేయడం అభినందనీయమని ప్రముఖ సినీ గేయ రచయిత, ప్రకృతి కవి జి.జయరాజ్ అన్నారు. మండల పరిధిలోని నాచారంలో ఎస్‌ఎస్‌వై ప్రకృతి యోగా ఆశ్రమాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్ర ముఖ పుణ్యక్షేత్రమైన అద్భుత వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కొండలు, గుట్టలతో ప్రకృతి పరవశించే ప్రదేశంలో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రకృతి పరిరక్షణ, ఆధ్యాత్మిక భావాలతో కూడిన ఆరోగ్య సంరక్షణకు నిర్విరామంగా ప్ర యత్నిస్తున్న యోగాచార్యులు డాక్టర్ ప్రేమ్ నిరంతర్ మల్లేష్‌గురూజీ ఆదర్శప్రాయులని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్, ఎస్‌ఎస్‌వై ని ర్వాహకులు దారా విష్ణుమోహన్‌రావు, దుగ్గిదేవర అజయ్‌కుమార్, కోటగిరి ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
భద్రాచలంఅర్బన్: అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను శనివారం భద్రాచలం పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలోని కొల్లుగూడెం వద్ద గోదావరి నుంచి ఇసుక నింపుకుని వస్తుండగా పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు.

విద్యుత్ సబ్ స్టేషన్‌లో నూతన బ్రేకర్