
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలోని స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావా చనం, అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్ర ధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరి పారు. వారాంతపు సెలవు దినాలు కావడంతో నిత్యకల్యాణంలో, ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
కొనసాగుతున్న నిమజ్జనం
భద్రాచలంటౌన్: భద్రాచలం గోదావరి తీరంలోని ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్‌కు వరుసగా మూడో రోజు శనివారం భారీగా దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి తరలిచ్చాయి. శరన్నవరాత్రుల సందర్భంగా పూజలు చేసిన భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి ప్రతిమలను నిమజ్జనానికి తీసుకొచ్చారు. విగ్రహాలను భారీ క్రేన్ల సహాయంతో వాహనాల నుంచి దించి లాంచీల ద్వారా గజ ఈతగాళ్లు నదిలో నిమజ్జనం చేస్తున్నారు. గోదావరిలో వరద ఉధృతి ఉండటంతో భక్తులను నిమజ్జన ఘాట్ వద్దకు అనుమతించడంలేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
తప్పిపోయిన వ్యక్తి
కుటుంబ సభ్యుల చెంతకు
బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఏ) గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గ్రామస్తులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అత డు అశ్వారావుపేట మండలం బండలగుంపు గ్రామానికి చెందిన సోడెం జోగారావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు తీసుకెళ్లారు. గతనెల 26న ములకలపల్లిలో తప్పిపోయినట్లు గా కుటుంబసభ్యులు తెలిపారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమైందని, దీంతో మతిస్థిమితం సక్రమంగా ఉండడం లే దన్నారు.