
మాసారు మాకే కావాలి
ఏన్కూరు: ‘మా సారు మాకు కావాలి’ అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన మండల పరిధిలోని తిమ్మారావుపేట ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. పాఠశాలలో పని చేస్తున్న చంద్రశేఖర్ అనే ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై కొత్త మేడపల్లికి బదిలీ చేయగా విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. 60 మంది విద్యార్థులున్న పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఒకరిని బదిలీ చేయడంతో ఆందోళనకు దిగారు. ఆయన వల్లనే విద్యార్థులు హాజరు శాతం పెరిగిందని, బాగా చదువుతున్నారని తల్లిదండుల్రు తెలిపారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన