
ప్రమోద్ విజయం.. యువతకు స్ఫూర్తి
సత్తుపల్లిటౌన్: గ్రూప్ –1 పరీక్షల్లో మెడికల్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఎంపికై న ప్రమోద్ సాయిని శనివారం సత్తుపల్లి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సృజన సాహితీ సమాఖ్య నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రమోద్ సాధించిన విజయం నేటి తరానికి స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు. అనంతరం ప్రమోద్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు గట్టే వాసు, జి.రామకృష్ణ, నిర్వాహకులు మధుసూదన్‌రాజు, పసుపులేటి నాగేశ్వరరావు, సత్యనారాయణ, నర్సింహారావు, అవినాష్, సంతోష్, ఆషా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.