
గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం
మధిర: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గాంధీజీ, శాస్త్రి జయంతి సందర్భంగా మధిరలోని క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ గాంధీజీ పాఇంచిన సత్యం, అహింస, సమానత్వం అనే విలువలు శాశ్వతమైనవని తెలిపారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అలాగే, లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ నినాదం రైతు, సైనికుల గౌరవాన్ని మరింతగా పెంచిందని తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్
శతాబ్ది వేడుకలు
కామేపల్లి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ(ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాలు శుక్రవారం రాత్రి కామేపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వయం సేవకులు ప్రత్యేక దుస్తుల్లో పద సంచలన్ చేశారు. అనంతరం సాయిబాబా ఆలయ ఆవరణలో జరిగిన సమావేశంలో జిల్లా సంఘ్ చాలక్ లక్కినేని ప్రసాద్ మాట్లాడారు. వ్యక్తి నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని తెలిపారు. స్వయం సేవకులు దేశాభివృద్ధి, సామాజిక శ్రేయస్సుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూరి శివరామకృష్ణ, మోహన్‌నాయక్, పోలూరి రామచంద్రయ్య, భద్రయ్య, దయానంద్, వెంకటాచారి, పూజల శివకృష్ణ, హన్మంతరావు, జర్పుల రామారావు, భూక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
టెట్ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేయాలి
మాజీ మంత్రి
దామోదర్‌రెడ్డికి నివాళి
ఖమ్మంమయూరిసెంటర్/కామేపల్లి: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇటీవల మృతి చెందగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో మృతదేహం వద్ద మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శుక్రవారం నివాళులర్పించి దామోదర్‌రెడ్డి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే, కామేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దామోదర్‌రెడ్డి చిత్రపటం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు.

గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం

గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం

గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం