
ఆస్తుల రక్షణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యం
ఖమ్మంక్రైం: రైల్వే శాఖకు చెందిన ఆస్తులను రక్షించడమే కాక ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఆర్‌పీఎఫ్ పని చేస్తోందని సికింద్రాబాద్ డివిజనల్ కమిషనర్ ఏ.నవీన్‌కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మంలోని ఆర్‌పీఎఫ్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆర్‌పీఎఫ్ పోలీస్ స్టేషన్‌కు కేటాయించిన గదులు, సిబ్బంది విశ్రాంతికి నిర్మించిన బ్యారక్‌లను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులతో పలు అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. ఆతర్వాత కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల గంజాయి, నిషేధిత మద్యాన్ని రైళ్లలో అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం ఉననందున విస్తృత తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. అంతేకాక రైల్వే ఆస్తులను రక్షించడానికి నిఘా తీవ్రం చేశామని చెప్పారు. ఆర్‌పీఎఫ్ సీఐ బుర్ర సురేష్‌గౌడ్, ఏఎఎస్సైలు మోడిన్సా, ప్రసన్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్‌పీఎఫ్ డివిజనల్ కమిషనర్ నవీన్‌కుమార్