
9నుంచి ఐదేళ్ల లా కోర్సు సప్లిమెంటరీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఆసిం ఇక్బాల్ అలీ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండు, 15న మూడు, 17న నాలుగో పేపర్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆయా తేదీల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఐదో సెమిస్టర్ పరీక్షలు..
ఐదేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. 8న మొదటి పేపర్, 10న రెండు, 14న మూడు, 16న నాలుగు, 18న ఐదో పేపర్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు రాజేందర్, ఆసిం ఇక్బాల్ తెలిపారు.