
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. తొలుత శ్రీవారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించగా.. అలివేలు మంగ అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరి దేవి రూపంలో అలంకరించారు. అంతేకాక శ్రీవకుళామాత స్టేడియంలో శమీ పూజ నిర్వహించారు. దసరా పండుగ కావడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. చివరగా అర్చకులు మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా గాంధీ జయంతి
ఖమ్మం సహకారనగర్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని గురువారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గాంధీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్రను కొనియాడారు. కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఉద్యోగులు రాజేష్, వెంకన్న, సీతారామారావు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఎంపీ
‘వద్దిరాజు’కు మళ్లీ అవకాశం
ఖమ్మంవైరారోడ్: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామక ప్రక్రియలో భాగంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు మరోమారు అవకాశం దక్కింది. పెట్రోలి యం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వరుసగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు. ఈమేరకు లోక్‌సభ డిప్యూటీ సెక్రటరీ సుజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 31 మంది సభ్యులు ఉండే ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10మంది ఎంపీలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.
కమ్యూనికేషన్స్,
ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం ఎంపీ
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. డాక్టర్ నిషికాంత్ దూబే చైర్మన్‌గా ఉన్న కమిటీలో ఏడాది క్రితం సభ్యుడిగా ఆయన నియమితులు కాగా, రెండో దఫా కూడా అవకాశం కల్పించారు. లోక్‌సభ నుంచి 20మంది, రాజ్యసభ ఉంచి పది మంది సభ్యులతో ఏర్పడే ఈ కమిటీలో రెండోసారి అవకాశం దక్కడంపై ఎంపీ రఘురాంరెడ్డికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతి నిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
పత్తి కొనుగోళ్లపై నేడు శిక్షణ
ఖమ్మంవ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లపై శని వారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ, మార్కెట్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ.అలీం తెలిపారు. ‘కపాస్ కిసాన్ యాప్’ డౌన్‌లోడ్ చేసుకోవడం, సెల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ కావడం, సీసీఐ కేంద్రం వద్ద పత్తి అమ్మకానికి స్లాట్ బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పించేలా ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తర్ణాధికారులు, మార్కెట్ల ఉద్యోగులు పాల్గొనాలని ఆయన సూచించారు.

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు