
పాలకవర్గం లేక పట్టింపు కరువు
● నిలిచిన ‘టేకులపల్లి’ సంఘం కార్యకలాపాలు ● రుణాలు, బీమా సౌకర్యం లేక రైతుల ఇబ్బందులు
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని ‘టేకులపల్లి ఆంధ్రాబ్యాంక్ కర్షక సేవా సంఘం లిమిటెడ్’ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు 14న ముగిసింది. ఇదే సమయాన పీఏసీఎస్‌ల పాలకవర్గాల గుడువు ముగియగా ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇంకొన్నిచోట్ల పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించారు. కానీ టేకులపల్లి సంఘానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా రైతులు, సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.