
శాండల్‌వుడ్‌లో మళ్లీ మీ టూ బాంబు
యశవంతపుర: శాండల్‌వుడ్‌లో మరోసారి మీ టూ ప్రకంపనలు తలెత్తాయి. తమను సహ నటులు వేధించారని ఐదారేళ్ల కిందట అనేకమంది నటీమణులు ఆరోపణలు చేయడం, అది తీవ్ర సంచలనం కావడం తెలిసిందే. ఇప్పుడు మరో ఉదంతం బయటపడింది.
ఓ కన్నడ నటికి లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై బెంగళూరు రాజాజీనగర పోలీసులు నటుడు, నిర్మాత హేమంత్‌కుమార్ (34) ను అరెస్ట్ చేశారు. రిచ్చి సినిమా షూటింగ్‌లో తనను వేధించాడని ఓ వర్ధమాన నటి (29) ఇటీవల ఫిర్యాదు చేసింది.
సినిమా చాన్సు ఇస్తానని..
2022లో రిచ్చి పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్ సమయంలో తనను పరిచయం చేసుకొని, మరో సినిమాలో చాన్సు ఇస్తానని నమ్మించి లైంగికంగా వేధించినట్లు నటి ఫిర్యాదులో పేర్కొంది. అడ్వాన్స్‌గా తనకు రూ.60 వేలు ఇచ్చాడని, షూటింగ్ సమయంలో లైంగికంగా సతాయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్‌లో అరకొర దుస్తులను ధరించి నటించాలని ఒత్తిడి చేశాడంది. ఆయన డిమాండ్లను నెరవేర్చని కారణంగా చిత్రంలో సెన్సార్ కానీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని తెలిపింది.
రాజాజినగర పోలీసులు నిందితుడు హేమంత్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులు, ఐటీ చట్టం తదితరాల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం కన్నడ సినీ లోకంలో సంచలనం కలిగిస్తోంది. మళ్లీ కొత్తగా మీ టూ ఉదంతాలు పుట్టుకొస్తాయేమోనని సినీ ప్రముఖుల్లో గుబులు నెలకొంది.
నిర్మాత వేధించాడని నటి ఫిర్యాదు
నిందితుడు అరెస్టు
బెంగళూరులో సంఘటన
సినిమా వేడుకలో మద్యం తాగించి..
2023 ఆగస్టులో ముంబైలో జరిగిన ఓ సినిమా వేడుకలో తనను మద్యం తాగమని బలవంతం చేశాడని, కూల్‌డ్రింకులో మద్యం కలిపి ఇచ్చాడని సదరు నటి తెలిపింది. తాను తెలియకుండా తాగడంతో మత్తులోకి జారుకోగా తనను ఫోటోలు, వీడియోలను తీసుకుని అసభ్యంగా మారుస్తానని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడని వాపోయింది. ఆ వీడియోలను తన తల్లికి పంపండంతో ఆమె భయాందోళనకు గురైందని తెలిపింది. ప్రశ్నించినందుకు గూండాలతో దాడికి యత్నించాడంది. తన వీడియోలు ఎక్కడా ప్రసారం కాకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు పొందానని ఆమె తెలిపింది. పోలీసులు హేమంత్‌ను ఆదివారం అరెస్టు చేసి జైలుకు తరలించారు.

శాండల్‌వుడ్‌లో మళ్లీ మీ టూ బాంబు

శాండల్‌వుడ్‌లో మళ్లీ మీ టూ బాంబు

శాండల్‌వుడ్‌లో మళ్లీ మీ టూ బాంబు