
పండుగ ముగిసింది.. ఆస్పత్రి కిక్కిరిసింది
బళ్లారి రూరల్ : గత కొద్దిరోజులుగా బళ్లారి నగరంలో తరుచుగా వానలు కురిశాయి. దీంతో వాతావరణ మార్పు, గాలి, నీరు కలుషితం కావడంతో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడ్డారు. అయితే దసరా పండుగ అయ్యాక వైద్యం కోసం పోవచ్చు అనుకున్నారో ఏమోగాని పండుగ రోజుల్లో ఆసుపత్రులు ఖాళీగా ఉండేవి. సోమవారం ఒక్కసారిగా వెల్లువగా బీఎంసీఆర్‌సీ అంతా రోగులతో కిక్కిరిసింది. మంగళవారం కూడా కొంత మేర రద్దీ కొనసాగింది. ముఖ్యంగా మెడిసిన్ విభాగంలో అనూహ్యంగా రోగులు పెరిగిపోయారు. సర్జరీ, క్యాజువాలిటీ, ఈఎన్‌టీ తదితర విభాగాల్లోను రోగులు అధికంగానే ఉన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల్లో అత్యధికులు జ్వరం, జలుబు, దగ్గుతో వచ్చిన వారు ఉన్నారు.
రోగులతో కిటకిటలాడిన బీఎంసీఆర్‌సీ
అన్ని విభాగాల్లోను రోగులు బారులు

పండుగ ముగిసింది.. ఆస్పత్రి కిక్కిరిసింది

పండుగ ముగిసింది.. ఆస్పత్రి కిక్కిరిసింది