
మహర్షి మార్గం ఆదర్శప్రాయం
బళ్లారి అర్బన్: నగరంలోని వాల్మీకి సర్కిల్‌లో రూ.1.10 కోట్ల వ్యయంతో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సర్కిల్‌ను అభివృద్ధి పరుస్తామని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నల్లచెరువులోని వాల్మీకి భవనంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో సీతారాముల శిల్పాలు చెక్కిన మైసూరుకు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా విగ్రహాన్ని చెక్కించామన్నారు. బళ్లారిలో వాల్మీకి శాఖ మఠం స్థాపిస్తామన్నారు. ప్రముఖులు ముండ్రగి నాగరాజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు వాల్మీకి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజలు నెరవేర్చారు. జయంతి శుభవేళ నగర వీధుల్లో వాల్మీకి చిత్రపటాన్ని ఊరేగించారు. ఊరేగింపులో మేయర్ ముల్లంగి నందీష్, ఎస్పీ శోభారాణి తదితర అధికారులు, కార్పొరేటర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
బీఎంసీఆర్‌సీలో..
బళ్లారి రూరల్ : మహర్షి వాల్మీకి జయంతిని మంగళవారం బళ్లారి వైద్య కళాశాల పరిశోధన కేంద్రం(బీఎంసీఆర్‌సీ) లోని బీసీ రాయ్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బీఎంసీఆర్‌సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులు మహర్షి వాల్మీకి జీవిత విశేషాలు, రామాయణం రచన గురించి తెలిపారు. ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, దంతవైద్య కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ భారతి, సీఏఓ మహేష్ హళేగౌడ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
హొసపేటెలో..
హొసపేటె: మహర్షి వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం విజయనగర జిల్లాధికారి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గవియప్ప, జిల్లాధికారి కవితా ఎస్. మన్నికేరి, ఎస్పీ జాహ్నవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే గవియప్ప మాట్లాడుతూ మహర్షి వాల్మీకి మనందరికీ ఆదర్శప్రాయమైన రామాయణం అనే గ్రంథాన్ని రచించారన్నారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ నోంగ్‌జాయ్ మహమ్మద్ అక్రమ్ పాషా, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: నగరంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతిని సంబరంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి సర్కిల్ వద్ద మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. మహర్షి వాల్మీకి ప్రతిమకు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, రాయచూరు శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పూలమాల వేశారు. అనంతరం వాల్మీకి భవనంలో అదనపు జిల్లాధికారి శివప్ప, కన్నడ సంస్కృతి శాఖ అధికారి రాజేంద్ర జాలదార్, వెంకటేష్‌లున్నారు. ఊరేగింపులో కళాకారుల నృత్యం ఇతర కార్యక్రమాలు జరిగాయి.
మహర్షి వాల్మీకి కన్న కల ప్రజారాజ్యం
హుబ్లీ: జిల్లా వ్యాప్తంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ప్రభుత్వం, సంబంధిత వర్గాలు పలు సంఘ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ధార్వాడలో జిల్లాధికారిణి దివ్యప్రభు తదితర అధికారుల ఆధ్వర్యంలో వివిధ చోట్ల వాల్మీకి విగ్రహాలను ప్రత్యేక పూజలు నెరవేర్చారు. అక్కడి ఆలూరు వెంకటరావ్ భవనంలో వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వాల్మీకి రామాయణం గురించి వక్తలచే ప్రత్యేక ప్రసంగాలు చేయించారు. ప్రముఖ పరిశోధకులు డాక్టర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి జయంతి వేడుకల్లో వక్తలు
సంబరాల మధ్య చిత్రపటం ఊరేగింపు

మహర్షి మార్గం ఆదర్శప్రాయం

మహర్షి మార్గం ఆదర్శప్రాయం

మహర్షి మార్గం ఆదర్శప్రాయం

మహర్షి మార్గం ఆదర్శప్రాయం