
మానవ హక్కుల రక్షణ సమితికి ఎంపిక
బళ్లారి రూరల్ : కర్ణాటక మానవ హక్కుల రక్షణ సమితి జిల్లాధ్యక్షుడుగా పి.అంజినిని ఎన్నుకొన్నట్లు రాష్ట్రాధ్యక్షుడు యూ.ఉరుకుంద ఓ ప్రకటనలో తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పి.అంజిని విద్యా శాఖలో ఉపాధ్యాయుడుగా, ప్రధానోపాధ్యాయుడుగా, మోకా క్లస్టర్ సీఆర్‌పీగా అందించిన ఉత్తమ సేవలను గుర్తించి జిల్లాధ్యక్షుడుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రాధ్యక్షుడు యూ.ఉరుకుంద, కోశాధికారి ఉప్పార వీరేశ్, ప్రముఖులు మల్లప్ప, హనుమంతప్పలు అంజినిని అభినందించారు.
కులగణనలో
ఉపాధ్యాయుడికి గుండెపోటు
హుబ్లీ: దావణగెరె తాలూకాలోని హళెకడ్లెబాళు స్కూల్ టీచర్ సోమవారం గుండెపోటుకు గురై దావణగెరె ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. టీచర్ ప్రకాష్ నాయక్(44) గుండెపోటుకు గురైన వ్యక్తి. సర్వే వేళ గుండెపోటు సంభవించడంతో స్థానికులు సమయస్ఫూర్తితో ఆయన్ను తక్షణమే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అప్పటికప్పుడే ఆపరేషన్ చేసి స్టంట్ అమర్చారు. మొత్తానికి ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కాగా కోలుకుంటున్న ప్రకాష్ నాయక్‌ను ఆ జిల్లాధికారి గంగాధరస్వామి పరామర్శించి ధైర్యం చెప్పారు.
పదవికి రాజీనామా
హొసపేటె: హొసపేటె సిటీ మున్సిపాల్టీ(నగరసభ) ఉపాధ్యక్షుడు రమేష్ గుప్తా రాజీనామా లేఖను జిల్లాధికారి కవితా ఎస్.మన్నికేరికి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి చేసిన రాజీనామా పత్రాన్ని రమేష్ గుప్తా మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి వెళ్లి విజయనగర జిల్లా మేజిస్ట్రేట్, జిల్లాధికారిణికి సమర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ హొసపేటె సిటీ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో ఉండటం గమనార్హం
రోడ్డు ఇలా..
ప్రయాణం ఎలా?
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారిలో మురుగు నీరు నిలిచింది. దేవదుర్గ తాలూకా గబ్బూరు గ్రామంలో ప్రధాన రహదారిలో గత కొన్ని నెలల నుంచి గ్రామ ప్రజలు ఉపయోగించిన మురుగు నీరు, నారాయణ పుర కుడి కాలువ నీరు రెండు కలిసి రహదారిని ముంచెత్తుతున్నాయి. రాయచూరు, కలబుర్గి, విజయపుర, శహాపుర, యాదగిరి, పూనా, షోలాపుర వంటి నగరాలను అనుసంధానించే రహదారి అధ్వానంగా మారింది. ఈ ప్రాంతం మీదుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సంచారం చేస్తారు. గత నెల 28న గబ్బూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
నేరాల అదుపునకు
ప్రజలు సహకరించాలి
రాయచూరు రూరల్: నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులతో సహకరించాలని గురుమఠకల్ పోలీస్ స్టేషన్ సీఐ వీరన్న దొడ్డమని పేర్కొన్నారు. మంగళవారం గురుమఠకల్ తాలూకా నజరాపుర గ్రామంలో ఇంటింటికీ పోలీస్ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్‌ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు.

మానవ హక్కుల రక్షణ సమితికి ఎంపిక

మానవ హక్కుల రక్షణ సమితికి ఎంపిక

మానవ హక్కుల రక్షణ సమితికి ఎంపిక

మానవ హక్కుల రక్షణ సమితికి ఎంపిక