
కిక్కు లేని చుక్క విక్రయాలు
బనశంకరి: ఎకై ్సజ్‌శాఖ అర్ధవార్షిక కార్యకలాపాల డేటా ప్రకారం రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెద్దగా పెరగడం లేదు. 2023, 2024 తో పోలిస్తే మద్యం విక్రయాల్లో భారీ తగ్గుముఖం కనబడింది. బ్రాందీ, విస్కీ తదితరాలపై ఎకై ్సజ్ సుంకాలను తరచూ పెంచడమే దీనికి కారణంగా అనుమానాలున్నాయి. రేట్లు పెరగడం వల్ల మందుబాబులు వెనుకంజ వేస్తున్నారు. వినియోగం తగ్గినప్పటికీ ఎకై ్సజ్ రాయల్టీకి ఢోకా లేదని మద్యం వ్యాపారులు చెప్పారు. రేట్లు, సుంకాల పెంపు వల్ల సర్కారుకు అమ్మకాల లోటు కనిపించడం లేదు.
గత మూడేళ్లలో ఇలా
2023 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్యకాలంలో 352.83 లక్షల బాక్సులు (ఒక బాక్సుకు 8.64 లీటర్లు) ఐఎంఎల్ మద్యం విక్రయమైంది, 2024 ఇదే అవధిలో 345.76 లక్షల బాక్సులు అమ్ముడయ్యాయి. 2025లో 342.93 లక్షల బాక్సులను తాగేశారు. ఇది గిరాకీ తగ్గుదలకు అద్దం పడుతోంది.
పాతాళానికి బీర్లు
2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో మొత్తం 242.73 లక్షల బాక్సులు (ఒక బాక్సులో 7.80 లీటర్లు) బీర్లను మందుబాబులు తాగేశారు. కానీ 2025 ఇదే అవధిలో 195.27 లక్షల బాక్సులే కొన్నారు. ఏకాఎకి 47.46 లక్షల బాక్సుల సరుకు అమ్ముడుపోలేదు.
ఈ క్షీణత 19.55 శాతంగా నమోదైంది. బీర్ల ధరలను సర్కారు విచ్చలవిడిగా పెంచడమే కారణం. అంత డబ్బు పెట్టలేక పేద, మధ్యతరగతి మందుబాబులు, యువత బీరుకు టాటా చెబుతున్నారు.
రాష్ట్రంలో గత 6 నెలల్లో భారీ క్షీణత
అధిక ధరలే కారణం
సర్కారుకు మాత్రం వేల కోట్ల ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం పంచ గ్యారంటీల పథకానికి నిధుల కోసం మద్యం ధరలను రెండేళ్లుగా పెంచుతూ వస్తోంది. ఫలితంగా
మందుప్రియులకు చేటుకాలం తలెత్తింది.
అంత ఖర్చు పెట్టి మద్యం కొనలేకపోతున్నారు. బెంగళూరుతో సహా రాష్ట్రంలో మద్యం విక్రయాలు పడిపోవడమే దానికి నిదర్శనం.
ఖజానాకు రూ.17 వేల కోట్లపైనే
మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎకై ్సజ్ శాఖ రాయల్టీ సేకరణలో తగ్గలేదు. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు మద్యం విక్రయాలతో రూ.17,702 కోట్ల రాయల్టీ దక్కింది. ప్రస్తుతం ఇదే అవధిలో రూ.19,571 కోట్ల రాబడిని ఆర్జించింది. రూ.1,869 కోట్లు అదనంగా సమకూరడం గమనార్హం.

కిక్కు లేని చుక్క విక్రయాలు

కిక్కు లేని చుక్క విక్రయాలు

కిక్కు లేని చుక్క విక్రయాలు