
చాముండి గిరులపై రథ సంభ్రమం
మైసూరు: మైసూరు విజయదశమి పండుగ ముగిసిన తరువాత చాముండి కొండపై సంప్రదాయంగా జరిగే అమ్మవారి రథోత్సవం సోమవారం వైభవోపేతంగా జరిగింది. రాజ ప్రముఖులు, వేలాదిమంది భక్తుల మధ్య తేరు ఉత్సవం కమనీయంగా సాగింది. జిల్లా నుంచే కాకుండా బెంగళూరు, కేరళ, తమిళనాడు నుంచి భక్తజనం రావడంతో చాముండిగిరులు కిటకిటలాడాయి.
రాజవంశీకుల హాజరు
వివిధ రకాల ఆభరణాలతో పాటు వైవిధ్య పుష్పాలతో చాముండేశ్వరి దేవిని, ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు ముస్తాబు చేశారు. ఉదయం 9:32 నుంచి 9:52 గంటల మధ్య శుభ ముహూర్తంలో ఉత్సవమూర్తిని తేరులో ప్రతిష్టించి జై చాముండేశ్వరి అని నినదిస్తూ తేరును లాగారు. మైసూరు ఎంపీ, రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్, త్రిషిక కుమారి దంపతులు, రాజమాత ప్రమోదాదేవి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు సంప్రదాయ ప్రకారం 21 సార్లు గాలిలోకి తుపాకులను పేల్చి అమ్మవారికి గౌరవ వందనం చేశారు. భక్తులు రథంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు.
చాముండి బెట్ట మీద తేరు ఉత్సవం
వైభవోపేతంగా అమ్మవారి వేడుక

చాముండి గిరులపై రథ సంభ్రమం

చాముండి గిరులపై రథ సంభ్రమం

చాముండి గిరులపై రథ సంభ్రమం