
క్షయపై నిరంతర పోరాటం
● మరోసారి బీసీసీ టీకా వేయించుకోవాలి
● ఆరోగ్య శాఖ తరఫున ముమ్మర ప్రచారం
హుబ్లీ: విశ్వవ్యాప్తంగా భారత్‌లో ఒకప్పుడు క్షయ, పోలియో, కుష్టురోగం, నారి పుండు రోగం, తట్లమ్మ తదితర రోగాలతో గ్రామీణులు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణపాయం కొని తెచ్చుకొనే వారు. పెరిగిన వైద్య రంగంలో విజ్ఞానం ఫలితంగా పుట్టినప్పటి నుంచే 16 ఏళ్ల వరకు వివిధ రకాల టీకాలు గత 70, 80 ఏళ్ల నుంచి అందరూ వేసుకున్న వారమే. తాజాగా ప్రస్తుతం క్షయ(టీబీ)కు వ్యతిరేకంగా పోరాటంలో విశ్వాసార్హమైన బీసీసీ టీకా వేసుకోవాలని జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా క్షయ రోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బీసీసీ టీకా గత కొన్నాళ్లుగా తీసుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
క్షయ వ్యాధి లక్షణాలు ఇవే
18 ఏళ్లు పైబడిన వారు ఈ కింద లక్షణాలు కలిగి ఉంటే తీసుకోవచ్చు. గతంలో కానీ ప్రస్తుతం కానీ క్షయ వ్యాధి బారిన పడిన వారు, క్షయ రోగులతో రక్త సంబంధం కానీ ఇరుగుపొరుగున ఉండేవారు, 60 ఏళ్లు నిండిన వయోవృద్ధులు, పౌష్టిక ఆహారం లోపం గల వ్యక్తులు ప్రస్తుతం కానీ, గతంలో కానీ తెగ ధూమపానం చేసేవారు కానీ, మధుమేహం చేసే వారు ఉచితంగా తమ సన్నిహిత, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సముదాయ ఆరోగ్య కేంద్రం, ఫిర్కా ఆరోగ్య కేంద్రం, తాలూకా ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలోని క్షయ విభాగం, అలాగే కేఎంసీ ఆస్పత్రిలోని క్షయ వ్యాధి విభాగం జంట నగరాల్లో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీసీసీ టీకాను వేయించుకోవచ్చు.
బీసీసీ టీకా వేయించుకోవాలి
అయితే ఆసక్తి ఉందని ఆయా ఆరోగ్య కేంద్రాలను సంప్రదిస్తే బీసీజీ వాయిల్ 10 మందికి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 10 మంది కూడే వరకు ఈ టీకాను వేయడానికి కుదరదు. కాబట్టి ఫోన్ నెంబర్లను ఆశా వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి ఇచ్చి వెళితే వారు ఫోన్ చేసిన సమయంలో సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి బీసీసీ టీకాను వేయించుకొని శాశ్వతంగా క్షయ, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సంబంధిత జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కేఎంసీ ఆస్పత్రిలోని టీబీ విభాగం అయిన రూ.55తో ఆధార్ కార్డుతో వచ్చిన వారు ఎవరైనా ఆ లక్షణాలతో ఉండి ఉంటే ఈ టీకాను తీసుకోవచ్చని, ఈ ప్రక్రియ మొత్తం ఉచితమేనని అధికారులు తెలిపారు. వివరాలకు 1800116666 సహాయవాణి నెంబర్‌లో సంప్రదించాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.