రైలు ప్రయాణికుల పాట్లు | - | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణికుల పాట్లు

Oct 7 2025 4:13 AM | Updated on Oct 7 2025 4:15 AM

రాయచూరు రూరల్‌: దసరా పండుగకు రాజధాని నుంచి స్వస్థలాలకు చేరుకున్న కల్యాణ కర్ణాటక రైలు ప్రయాణికులు ఆదివారం రాత్రి తిరిగి రాజధానికి బయలుదేరి రైలులో నానా పాట్లు పడ్డారు. రాయచూరు రైల్వే స్టేషన్‌లో రైలు బోగీలను పరిశీలించగా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. కిక్కిరిసిన బోగీల్లో కింద పడుకొని పిల్లా పాపలతో ప్రయాణించారు. బోగీల్లో ఎక్కడా అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. లాతూర్‌ నుంచి బెంగళూరు వరకు వెళ్లే ఈ రైలులో బీదర్‌, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వెళ్లే వ్యవసాయ కూలీలు, ఇతర ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. పండుగ సమయంలో అదనపు రైళ్లు నడపకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అదనపు బోగీలను అమర్చకుండా ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలున్నాయి.

రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో శుభ్రతకు శ్రీకారం

రాయచూరు రూరల్‌: రాయచూరు రైల్వే స్టేషన్‌లో రైల్వే బోర్డు సలహా సమితి సభ్యులు శుభ్రతకు శ్రీకారం చుట్టారు. సోమవారం రైల్వేస్టేషన్‌లో సభ్యుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రధాని ఆదేశాల మేరకు ప్రతి రైల్వేస్టేషన్‌ శుభ్రతకు ప్రాధాన్యత కల్పించాలనే సదుద్దేశ్యంతో రైల్వే కాంపౌండ్‌లో పెరిగిన ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో తొలగించారు. నగరసభ, రైల్వే శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛత అభియాన్‌కు నడుం బిగించారు. రైల్వే బోర్డు సలహా సమితి సభ్యులు మారెప్ప, సీతా నాయక్‌, నవీన్‌ కుమార్‌, రమేష్‌, సిద్దలింగయ్య, మహేష్‌, అధికారులు అమరేష్‌, మల్లికార్జున, హేమరాజ్‌లున్నారు.

మొసలి పట్టివేత

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలూకా యక్లాస్‌పూర్‌లో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. యక్లాస్‌పూర్‌ గ్రామం చెరువు పక్కనే ఉండగా చెరువులో నీరు నిండా ఉన్నాయి. కాగా పైభాగంలో నుంచి మొసలి వచ్చిందంటూ చేపలు పట్టే మత్స్యకారులు అప్రమత్తమై మొసలిని పట్టుకొని బంధించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

రైతు సమస్యలపై స్పందిస్తాం

రాయచూరు రూరల్‌: ఇటీవల కురిసిన వర్షాలకు యాదగిరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వరదల బారిన పడి నీరు చేరిన పంట పొలాల్లో నష్టం సంభవించిన రైతులకు పరిహారం అందించే దిశలో సమీక్షలపై సర్కార్‌, మంత్రులు స్పందిస్తారని రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌, యాదగిరి శాసన సభ్యుడు చెన్నారెడ్డి పాటిల్‌ పేర్కొన్నారు. సోమవారం యాదగిరి తాలూకా వడగేర, బాడియాళ, కట సంగావి ప్రాంతాల్లో పత్తి పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలపై అధికారులు సత్వరం స్పందించాలని అన్నారు. రైతులకు వాటిల్లిన పంట నష్టాలపై సక్రమంగా సర్వే చేసి పరిహారం అందించాలన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతి

హుబ్లీ: కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతి చెందిన ఘటన తాలూకాలోని వరూరు గ్రామంలో జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఓ యాచకుడు(45) రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్థానిక గోకుల్‌ రోడ్డులో బన్ని(జమ్మి) చెట్టు దగ్గర ఉన్న మొబైల్‌ టవర్‌లో ఏర్పాటు చేసిన సుమారు రూ.1.06 లక్షలు విలువైన పరికరాలను దుండగులు చోరీ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

రైలు ప్రయాణికుల పాట్లు1
1/4

రైలు ప్రయాణికుల పాట్లు

రైలు ప్రయాణికుల పాట్లు2
2/4

రైలు ప్రయాణికుల పాట్లు

రైలు ప్రయాణికుల పాట్లు3
3/4

రైలు ప్రయాణికుల పాట్లు

రైలు ప్రయాణికుల పాట్లు4
4/4

రైలు ప్రయాణికుల పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement