
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి
కోలారు: సరిహద్దుల్లో సైనికుల పహారా, పొలంలో రైతులు వ్యవసాయం చేయడం వల్లనే నేడు దేశం సుభిక్షంగా ఉంది. ప్రభుత్వాలు ఈ రెండు రంగాలకు అధిక ప్రాదాన్యత ఇచ్చినప్పుడే దేశం మరింత బలిష్టంగా మారుతుందని బీకేఎస్ దక్షిణ ప్రాంత ఉపాధ్యక్షుడు ఏ.అప్పాజీ గౌడ తెలిపారు. తాలూకాలోని దుగ్గసంద్రరర్కా దిన్నహళ్లి గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ గ్రామ సమితిని ప్రారంభించి మాట్లాడారు. గ్రామ ఐక్యతను కాపాడుకోవాలని సూచించారు. రైతు సమస్యలు, గ్రామ అభివృద్ధిపై ప్రతి వారం సభ నిర్వహించి చర్చించుకోవాలన్నారు. గ్రామ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వారు స్పందించకపోతే ప్రతిఘటనలకు దిగాలని తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆధునిక వ్యవసాయ యుగంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దరు ధరలు అందించాలన్నారు. కార్యక్రమంలో బీకేఎస్ జిల్లా కోశాధ్యక్షుడు న్యాయవాది వి.జయప్ప, భారతీయ కిసాన్ సంఘానికి చెందిన ఎన్.తమ్మణ్ణ, దిన్నహళ్లి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీరామప్ప, కార్యదర్శి వి.భార్గవరాం, సభ్యుడు కె.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.