వెట్టి చాకిరీ | - | Sakshi
Sakshi News home page

వెట్టి చాకిరీ

Oct 7 2025 3:53 AM | Updated on Oct 7 2025 3:53 AM

వెట్ట

వెట్టి చాకిరీ

మంగళవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
చిట్టి చేతులు..

సాక్షి, బెంగళూరు: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వెళ్తుంటే చిన్నారి బాలలు కష్టించి పనిచేస్తూ కనిపిస్తారు. అంగళ్లు, మెకానిక్‌ షెడ్లు, హోటళ్లు, కర్మాగారాలు, కట్టడ పనుల్లో నలిగిపోతుంటారు. కన్నడనాట బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా, కోట్లు ఖర్చు పెడుతున్నా మార్పు రావడం లేదు. కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత, బాలల అక్రమ రవాణా తదితర ఎన్నో కారణాల వల్ల పిల్లలు కార్మికులుగా మగ్గిపోతున్నారు. వారికి విద్య, ఆహారం, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులు దక్కడం లేదు. ఎవరూ కూడా 14 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకోరాదు, అతిక్రమించిన వారు శిక్షార్హులవుతారు. కానీ ఎవరూ పాటించడం లేదు. తక్కువ కూలీకే వస్తారని పిల్లలతో పనిచేయిస్తున్నారు.

అప్పుడప్పుడూ దాడులు

బాల, కిశోర వర్గ కార్మికుల నిషేధ, నియంత్రణ చట్టం–1986 సెక్షన్‌ 16,17 కింద ప్రభుత్వం 11 శాఖల అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించింది. వీరి ద్వారా తరచూ తనిఖీలు చేపడుతూ బాల కార్మికులను గుర్తించి వారిని రక్షిస్తూ వస్తోంది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 1,599 కేసులు నమోదు అయ్యాయి. 2,834 మంది బాల కార్మికులను రక్షించారు. అయితే సరైన పునరావాస చర్యలు లేక ఆ బాలలు మళ్లీ పనులకు వెళ్తున్నట్లు సేవాసంస్థల కార్యకర్తలు చెబుతున్నారు.

ఏటా రూ.6 కోట్ల వ్యయం

బాల కార్మిక పద్ధతి నిర్మూలన కోసం కార్మిక శాఖ అవగాహన జాతాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రతి ఏటా సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ 6 కోట్ల వరకు ఖర్చు కూడా చేస్తున్నారు. 2020 నుంచి ఈ ఏడాది వరకు రూ 23.46 కోట్లు ఇందుకు వెచ్చించారు. కానీ ఫలితాలు కనిపించడం లేదు. పైగా ప్రతి ఏటా వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

కోవిడ్‌ కొరడా

కోవిడ్‌ విపత్తు అనేక కుటుంబాలను పేదరికంలోకి నెట్టేసింది. ఆ తరువాత బాల కార్మికుల సంఖ్య మరింతగా అధికమైంది. 2023 నుంచి 2025, జూన్‌ వరకు అధికారులు దాడులు జరిపి 651 బాల కార్మిక కేసులను నమోదు చేశారు. బాలలను పనిలో పెట్టుకున్నందుకు 50 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. సుమారు రూ. 31.91 లక్షల మేర జరిమానాలు వసూలు చేశారు. 2023 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 123 కేసులు ఒక్క బెంగళూరులోనే వచ్చాయి. ఈ మూడేళ్లలో 88 పిల్లలను అధికారులు రక్షించారు. మొత్తం 57 కేసులు కోర్టులో విచారణకు రాగా, ఇందులో 8 కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. అనేక కేసుల్లో బాధితులు తెరవెనుక రాజీ పడుతుంటారు.

చదువు లేదు. ఆటపాటలు లేవు. సరైన పోషకాహారం అందదు. లేత చేతులు రాళ్లు కొడుతూ, గిన్నెలు, కప్పులు కడుగుతున్నాయి, బరువులు మోస్తున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో సమిధలవుతున్నారు. పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బీడీలు చుడుతోంది. పేదరికం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇందుకు కారణమని చెప్పక తప్పదు.

సమాజాన్ని పీడిస్తున్న బాల

కార్మిక దురాచారం

చదువు సంధ్యలకు బాల్యం దూరం

ఫలించని జాగృతి కార్యక్రమాలు

ఐదేళ్లలో 1,599 కేసుల నమోదు

వెట్టి చాకిరీ1
1/3

వెట్టి చాకిరీ

వెట్టి చాకిరీ2
2/3

వెట్టి చాకిరీ

వెట్టి చాకిరీ3
3/3

వెట్టి చాకిరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement