
చెట్టు.. తీసింది ఊపిరి
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరానికి చెట్లు ఎంత అందాన్ని ఇస్తాయో అంతే ముప్పుగా కూడా మారాయి. ఎప్పుడు ఏది విరిగిపడి ప్రాణం తీస్తుందో తెలియడం లేదు. చెట్టు పడి యువతి దుర్మరణం చెందగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిటీలో సోలదేనహళ్లిలో జరిగింది. హెబ్బాళకు చెందిన కీర్తన (24) మృతురాలు కాగా, మరో బైకిస్టు భాస్కర్, రాధ క్షతగాత్రులు.
గతంలో ఫిర్యాదు
ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేయాలని ఎన్నిసార్లు పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పడిపోయిన చెట్టు ఏడాది నుంచి ప్రమాదకరంగా ఉందని చెప్పారు.
కూలిపడి యువతి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు
బెంగళూరులో విషాద ఘటన

చెట్టు.. తీసింది ఊపిరి

చెట్టు.. తీసింది ఊపిరి