
కల్మఠంలో కుంభమేళా ప్రారంభం
రాయచూరు రూరల్ : జిల్లాలోని మాన్వి కల్మఠంలో దసరా దర్బార్‌లో భాగంగా కుంభమేళాకు ప్రజా ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. సోమవారం మాన్వి కల్మఠంలో రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ పాల్గొని మాట్లాడారు. హిందూ సంప్రదాయాలను భక్తితో చేపట్టే విషయంలో కల్మఠం ముందుంటుందన్నారు. శ్రీదేవి మహా పురాణం, సువర్ణ దసరా మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీశైల, రంభాపురి, కాశీ జగద్గురువులు పాల్గొన్నారు. అనంతరం మఠాధిపతి విరుపాక్ష పండితారాధ్య వారిని సన్మానించారు. రంభాపురి జగద్గురువులను అడ్డ పల్లకీ సేవలో ఊరేగించారు.

కల్మఠంలో కుంభమేళా ప్రారంభం

కల్మఠంలో కుంభమేళా ప్రారంభం