
ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
మాలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందించాలని స్వాభిమాని జనతా పార్టీ సంస్థాపక అధ్యక్షుడు హూడి విజయ కుమార్ తెలిపారు. సోమవారం తాలూకాలోని బాళిగానహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని నాగొండహళ్లి గ్రామంలో యోగామృత ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో రంగవర్తన పిల్లల నృత్య, నాటక, సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలలో అపర ప్రజ్ఞా పాటవాలు ఉంటాయని తెలిపారు. వాటిని వెలికి తీయడానికి సరైన వేదిక కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు సాంస్కృతికంగా ప్రగతిని సాధించాలని సూచించారు. యోగామృత ఫౌండేషన్ నుంచి పిల్లలకు నాటక, సంగీత, నృత్య తదితర కళా ప్రకారాల్లో శిక్షణ ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఫౌండేషన్ నుంచి చిట్‌పట్ చిన్నర సంస్కృతి హబ్బ, సేవా అవార్డుల ప్రదానం, రాష్ట్ర స్థాయి బంగారు పతకం సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం గర్వించదగిన విషయమన్నారు. కార్యక్రమంలో కరవే తాలూకా అధ్యక్షుడు ఎం.ఎస్ శ్రీనివాస్, యోగా సంస్థ శంకర్, కరవే ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.