
అమ్మా.. నాన్నా కావాలి
ఉరవకొండ: తల్లిదండ్రులు మృత్యువాత పడ్డారని తెలియని ఈ బాలుడు తన ఒక కాళ్లు పూర్తి దెబ్బతిన్నా అంతటి నొప్పిలోను మమ్మి,. డాడీ కావాలి...అంటూ డాక్టర్లు, నర్సులను చూస్తూ రోదించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. తల్లిదండ్రులను దూరం చేసి తన బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితిలో చిన్నారిని చూసి అందరూ అయ్యో అని అంగలార్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విడపనకల్లు శివారులోని బళ్లారి– అనంతపురం జాతీయ రహదారిలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో తల్లిదండ్రులు చనిపోగా బాలుడు అద్విక్ (5) తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖపట్టణానికి చెందిన రామ్‌సుధీర్ (38), లావణ్య (34) దంపతులు, రామ్‌సుధీర్‌కు పెనుకొండలోని కియా కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగం రావడంతో వచ్చాడు. అనంతపురంలో కుటుంబంతో ఉంటూ రోజూ కంపెనీ బస్సులో పెనుకొండకు వెళ్లివచ్చేవాడు.
హంపీకి వెళుతుండగా..
దసరా సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి హంపీ టూర్‌కు 4న కారులో బయలుదేరారు. ఘటనాస్థలిలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొంది, రెండు కార్లు దెబ్బతినగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లావణ్య అక్కడే చనిపోగా, రామ్‌సుధీర్ తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడు అద్విక్‌కు ఒక కాళ్లు విరిగి తీవ్రంగా అవస్థలు పడ్డాడు. మరో కారులో నలుగురు సంజీవ్‌రెడ్డి, శ్రీనివాసులు, పుల్లయ్యనాయుడు, నాగిరెడ్డి గాయపడ్డారు. బాధితులను ఉరవకొండకు, ఆపై అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. రామ్‌సుధీర్ అనంతపురం జీజీహెచ్‌లో చనిపోయాడు. అక్కడే బాలుడు అద్విక్ చికిత్స పొందుతూ అమ్మానాన్నల కోసం ఆరాటపడుతున్నాడు.
విడపనకల్లు వద్ద
రెండు కార్లు ఢీకొన్న ఘటన..
తల్లిదండ్రులు కొన్నిగంటల్లోనే మృతి
అనాథగా మారిన వైజాగ్ బాలుడు

అమ్మా.. నాన్నా కావాలి

అమ్మా.. నాన్నా కావాలి

అమ్మా.. నాన్నా కావాలి