
ఉల్లి రైతు కన్నీరు
రాయచూరు రూరల్: జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లికి గిటుబాటు ధర లేకపోవడంతో నష్టాలపాలవుతున్నారు. ఈ ఏడాది రాయచూరు జిల్లాలో 753 హెక్టార్లు, యాదగిరిలో 658 హెక్టార్లు, కొప్పళలో 569 హెక్టార్లు, బళ్లారిలో 489 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. రాయచూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుంచి రాయచూరు ఏపీఎంసీకి ఉల్లిగడ్డలను తీసుకొస్తారు. అయితే ధరలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం క్వింటాల్ రూ.705 నుంచి రూ.1,196 వరకూ ధరలు పలుకుతున్నాయి. ఉల్లిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా ముందుకు రావడం లేదు. రాయచూరు ఏపీఎంసీకి రోజు 200 క్వింటాళ్లకు పైగా ఉల్లిగడ్డలు వస్తాయి. శనివారం సాయంత్రం ఓ రైతు 62 క్వింటాళ్ల ఉల్లి గడ్డలను మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో మార్కెట్‌లోనే వదిలేసిపోయాడు. రాయచూరు ఏసీఎంసీ మైదానంలో పశువులు ఉల్లిగడ్డలను తింటూ కనిపించాయి.
తగ్గుముఖం పట్టిన ధరలు
లబోదిబోమంటున్న రైతులు

ఉల్లి రైతు కన్నీరు