
ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో విస్తృత సేవలు
రాయచూరు రూరల్: ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య సమాజం మహసభ అధ్యక్షుడు రవి శంకర్ పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరులత సమావేశంలో మాట్లాడారు. కులమత భేదాలు లేకుండా 1,600 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేశామని తెలిపారు. 102 పాఠశాలల్లో 6,300 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారని పేర్కొన్నారు. వాసవి చేతన్ పేరుతో 387 మంది వృద్ధులకు నెలకు రూ.1000, సంద్యా శ్రీ (వితంతువులకు) 536 మందికి రూ.1,500, వాసవీ అకాడమీలో 35 మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ కోసం శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. 2 వేల మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ కోసం రూ.1.3 కోట్లు ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య మండళి అధ్యక్షుడు రామ్ ప్రసాద్, కుంట్నాళ వెంకటేష్, జగదీష్, హన్మంతయ్య, వీరేష్, వాసుదేవ్, బీమా శంకర్ పాల్గొన్నారు.
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
రాయచూరు రూరల్: ఆర్యవైశ్య సమాజం సభ్యులు కుటుంబంగా ఏర్పడి అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఆర్యవైశ్య సమాజం మహసభ అధ్యక్షుడు రవిశంకర్, ఆర్యవైశ్య మండళి అధ్యక్షుడు రామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్‌లో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సమాజం దానాలకు ప్రతి రూపమైన వ్యాపారాలతో పాటు సమాజంలో సాంఘికంగా, విద్య, రాజకీయంగా ఎదగాలని కోరారు. వ్యాపారాలతో కాలయాపన చేయకుండా భవిష్యత్తు తరాల వారికి ముందు చూపుతో నడవాలన్నారు. వ్యాపారాలు చేసుకుని జీవనం గడుపుతారనే భావన పోయి సమాజం కోసం యువకులు ముందుకు రావాలన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు కుంట్నాళ వెంకటేష్, జగదీష్, హన్మంతయ్య, వీరేష్, వాసుదేవ్, బీమాశంకర్, సునీత, కిరణ్, రాఘవేంద్ర, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.