
సాహిత్యానికి కన్నడిగుల సేవలు భేష్
బళ్లారి అర్బన్: ప్రపంచ సాహిత్యానికి కన్నడిగులు విశేష సేవలు అందించారని ఎస్‌కేడీ వర్సిటీ ఆంగ్ల భాష ప్రొఫెసర్ శాంత నాయక్ తెలిపారు. స్థానిక శరణ సాహిత్య పరిషత్ జిల్లా శాఖ, అలాగే బళ్లారి సంస్కార భారతీ ఆధ్వర్యంలో బీపీఎస్‌సీ పాఠశాల మీటింగ్ హాల్‌లో భైరప్ప సంస్మరణ, నాడహబ్బ దసరా కవిగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైరప్ప నవలల్లో పౌరాణిక విషయాలను అద్దంలో పెట్టి చూస్తారన్నారు. భైరప్ప నవలలు పాఠకులకు ఎంతో ఇష్టమని తెలిపారు. అలాగే నాడ హబ్బ సందర్భంగా కవిగోష్టి ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. వర్ధమాన కవులతో కన్నడ సాహిత్యం మరింత సంపన్నం కావాలన్నారు. ఎస్‌ఎల్ భైరప్ప, మేటి కళాకారుడు యశ్వంత్ పర్‌దేశ్‌పాండే మృతి కన్నడ భాషకు అపారమైన నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. భైరప్ప బతుకు రచనలపై అధ్యాపకులు డాక్టర్ కొట్రెష్ చక్కగా వివరించారు. మున్సిపల్ కళాశాల ప్రిన్సిపాల్ కే.సుంకప్ప, కేవీ నాగిరెడ్డి, డాక్టర్ తిప్పేరుద్ర సండూరు, ఎర్రిస్వామి, రామరావు కులకర్ణి, వీరేష్ స్వామి, డాక్టర్ కె.బసప్ప, తదితర 25 మందికి పైగా కవులు తమ కవితలను పాడి వినిపించారు. కార్యక్రమంలో చాంద్‌పాషా, లెక్చలర్ వీరేష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.