
చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హోస్పేట్ తాలూకా గడిగనూర్‌లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో శనివారం మరో ఇద్దరు మరణించారు. గృహ నిర్మాణం, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ, విజయనగర్, బళ్లారి ఇన్‌చార్జ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆస్పత్రిని సందర్శించారు. మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మరణించిన మైలారప్ప, కవిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. అనంతరం మృతదేహాలను అంబులెన్స్ ద్వారా వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటనలో మొత్తం నలుగురు మరణించగా.. విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు.
గడిగనూర్‌లో
వంట గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన