
విహారయాత్ర విషాదాంతం
యశవంతపుర: పిక్నిక్‌కు వెళ్లిన రెండు కుటుంబాలు అరేబియా సముద్రంలో బోటులో విహరిస్తుండగా అది బోల్తాపడి నలుగురు జల సమాధి అయ్యారు. మరో నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. ఈ విషాదఘటన మహారాష్ట్ర సింధుదుర్గ జిల్లా వెంగుర్ల తాలూకా శిరోడ సమీపంలోని వేళాగర బీచ్‌లో జరిగింది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా లోండా గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు దసరా సెలవుల నేపథ్యంలో వేళాగర బీచ్‌కు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బోటులో విహరిస్తుండగా భారీ అల లాక్కెళ్లింది. కొద్ది సేపుటి తరువాత ముగ్గరి మృతదేహాలు బయట పడగా నలుగురు సురక్షతంగా బయట పడ్డారు. మరో మృతదేహం శనివారం ఉదయం బయట పడింది. మృతులను లోండాకు చెందిన ఇర్పాన్ ఇసాక్ కిత్తూర(38), అయన భార్య ఫరినా ఇర్పాన్ కిత్తూర(31), వీరి కుమారుడు ఇబాద్ కిత్తూర(12), ఇర్పాన్ తమ్ముడి కుమారుడు ఇక్వాన్ ఇమ్రాన్ కిత్తూర(15)లుగా గుర్తించారు. ఇమ్రాన్ కిత్తూర, జబీన్ ఇమ్రాన్ కిత్తూర, ఇజాన్ ఇమ్రాన్ కిత్తూర, ఇస్రా ఇమ్రాన్ కిత్తూరలు సురక్షితంగా బయట పడ్డారు. మృతదేహాలను మహారాష్ట్ర సావంతవాడి ఆస్పత్రికి తరలించిపోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఖానాపుర తాలూకా లోండా గ్రామంలో శనివారం మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. నలుగురి మృతితో గ్రామాన్ని విషాదం కమ్మేసింది.
బోటు మునిగి నలుగురు మృతి
మృతులు బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా వాసులు
మహారాష్ట్ర సింధుదుర్గ జిల్లాలో ఘటన