
ప్రతి జిల్లాకూ మెడికల్ కళాశాల
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ మెడికల్ కళాశాల, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. శనివారం ఆయన బెళగావిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారంతా పేద, మధ్యతరగతి ప్రజలేనని, వారికి మంచి వైద్యం,చికిత్స అందించడం ఎంతో అవసరమన్నారు. అందుకే ప్రతి జిల్లాలో వైద్యకళాశాల, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలనుకుంటున్నామన్నారు. అందుకు తగినట్టు వైద్యులను, వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు.
గ్యారంటీ పథకాలకు వచ్చే ఆదరణ చూసి బీజేపీకి నిద్ర పట్టనివ్వడం లేదు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలకు వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ వారికి నిద్రపట్టడం లేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులను గ్యారంటీ పథకాలకు మళ్లించామని ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అన్నారు. గ్యారంటీ పథకాలను బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యాణ తదితర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. బెళగావిలోని బిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 2017లో శంకుస్థాపన చేయగా ఇప్పుడు ప్రారంభించడం ఆనందంగా ఉందని,ఆస్పత్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయమన్నారు.
సీఎం సిద్ధరామయ్య