
శిశు మరణాలకు కారణాలివే..
అవధికి ముందే జననం, తక్కువ బరువుతో ఏర్పడే సమస్యలు, పుట్టుక సమయంలో శ్వాసకోశ సమస్య, న్యుమోనియా, సెప్సిస్, పుట్టుకతో గుండె సమస్య, నరవ్యూహ సంబంధించిన దోషాలతో అభివృద్ధి చెందిన దేశాల్లో శిశువుల మరణాల ప్రమాణం తక్కువగా ఉంది. కానీ అభివృద్ధి చెందుతున్న వెనకబడిన రాష్ట్రాల్లో అధికంగా ఉంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే ప్రస్తుత ఏడాది శిశుమరణాలు తగ్గాయని ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉన్నా కొన్ని సార్లు అకాలిక శిశుమరణాలు సంభవిస్తున్నాయని భారతీయ వైద్య సంఘం కర్ణాటక శాఖ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.శ్రీనివాస్ తెలిపారు.