
నాన్నా.. నువ్వు రా..
శివమొగ్గ: పండుగ వేళ తల్లీ కుమార్తె అనుమానాస్పద రీతిలో మరణించారు. వేట కొడవలితో నరికిన రీతిలో కుమార్తె మృతదేహం, ఉరికి వేలాడుతూ తల్లి దేహం ఉన్నాయి. ఈ దుర్ఘటన శివమొగ్గ నగరంలోని మెగ్గాన్ ఆస్పత్రి క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది.
వివరాలు ఇలా ఉన్నాయి.. మెగ్గాన్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రామన్న భార్య శృతి (38), 6వ తరగతి చదివే కుమార్తె పూర్విక (12) కుటుంబం జీవిస్తోంది.
10:30కు తండ్రికి చిన్నారి ఫోన్
రామన్న సాయంత్రం గురువారం రాత్రి డ్యూటీకి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా తలుపులు తెరవలేదు. చుట్టుపక్కలవారి సహకారంతో తలుపులను విరగ్గొట్టి వెళ్ళి చూడగా కూతురు రక్తపుమడుగులో ఉంది, భార్య ఉరికి వేలాడుతోంది. కొడవలితో ఆమె పాపను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. రామన్న బోరుమంటూ విలపించాడు, కాగా, తన భార్యకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదని, చికిత్స కూడా చేయిస్తున్నట్లు చెప్పాడు. రాత్రి 10:30 సమయంలో తన కూతురు ఫోన్ చేసిందని, తల్లి విచిత్రంగా ప్రవర్తిస్తోందని, భయంగా ఉందని చెప్పిందన్నాడు. తాను కూతురికి నచ్చజెప్పానని, తాను వెళ్లి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని రోదించాడు. దొడ్డపేటె పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. ఈ సంఘటనతో మెగ్గాన్ క్వార్టర్స్‌లో భయం, విషాదం అలముకొంది.
తండ్రికి కూతురి ఫోన్‌కాల్
కొంతసేపటికే తల్లి చేతిలో
పాప హత్య, తల్లి ఆత్మహత్య
శివమొగ్గలో విషాద ఘటన

నాన్నా.. నువ్వు రా..