
ముంపు నివారణ పనులు పూర్తి చేయండి
బనశంకరి: బెంగళూరు తూర్పు నగరపాలికె పరిధిలోని సాయిలేఔట్ వద్ద రైల్వేవెంట్ ఇరుకుగా ఉండటంతో రాజకాలువనీరు సజావుగా ముందుకు వెళ్లలేక సాయిలేఔట్ పరిసరాల్లో ముంపు పరిస్థితులు తలెత్తుతున్నాయి .దీంతో రూ.13.36 కోట్లతో రైలు పట్టాల కింద 6 మీటర్ల వెడల్పు, 4.5 మీటర్ల ఎత్తులో రెండు బల్క్ కాస్టింగ్ పనులు చేపట్టారు. గ్రేటర్ కమిషనర్ మహేశ్వర్‌రావ్ శుక్రవారం పరిశీలించారు. డిసెంబర్‌లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హెణ్ణూరు–బాగలూరు రోడ్డులో వైట్‌టాపింగ్ పనులను పరిశీలించారు. సాయిలేఔట్‌లో బ్లాక్‌స్పాట్‌లను తొలగించాలని ఆదేశించారు.