
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ రూరల్: పండగ వేళల్లో రోడ్లపై రద్దీగా ఉంటుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా జంక్షన్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్– హన్మకొండ, సిద్దిపేట–సూర్యాపేట రోడ్లపై తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు, రాజేశ్ కానిస్టేబుల్ ఉన్నారు.