
హోటళ్లలో ‘ఫుడ్‌సేఫ్టీ’ తనిఖీలు
జనగామ: జిల్లా కేంద్రంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు బుధవారం ఫుడ్‌సేఫ్టీ, మునిసిపల్ అధికారులు సంయుక్తంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో తిననుబండారాల తయారీ, భద్రత తదితర అంశాలకు సంబంధించి పరిశీలించారు. ఆహార పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి వినీల్ కుమార్ హెచ్చరించారు. నిర్వహణ సిబ్బందికి క్యాప్స్, డ్రెస్ కోడ్‌తో పాటు చేతులకు గ్లౌజులు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. 8 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు రూ.13వేల జరిమానా విధించినట్లు తెలిపారు. తనిఖీల్లో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ పులి శేఖర్, శానిటరీ జవాన్లు, సిబ్బంది ఉన్నారు.
8 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు రూ.13వేల
జరిమానా