
త్వరగా పూర్తి చేయాలి
టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబ ట్టి ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉపాధ్యాయులు వస్తారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాద్యాయ సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం ద్వారా విద్యార్థుల సంఖ్యను తగ్గకుండా చూడొచ్చు. జిల్లా విద్యాశాఖ త్వరగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి.
– రావుల రామ్మోహన్‌రెడ్డి, టీచర్, జనగామ
●
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యంతో పిల్లల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యాభ్యాసన ప్రక్రియ కుంటుపడిపోతోంది. ఒక మండలంలో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నప్పటికీ వారిని కాదని పక్క మండలం నుంచి సర్దుబాటు చేయడం సరైనది కాదు. దూర ప్రాంత మండలాల నుంచి పట్టణ సమీప మండలాలకు సర్దుబాటు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉపాధ్యాయులు అదనంగా లేని పాఠశాల నుంచి సర్దుబాటు పేరుతో పట్టణ సమీప ప్రాంతానికి డిప్యూటేషన్ ఇవ్వరాదు.
– డి.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీపీటీఎఫ్

త్వరగా పూర్తి చేయాలి