
విద్యుత్‌చౌర్యం, మొండిబకాయిలపై ప్రత్యేక నిఘా
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ చౌర్యం, మొండిబకాయిలపై ప్రత్యేక నిఘాతో పనిచేస్తున్నట్లు విద్యుత్‌శాఖ స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ ఏఈ శంకర్ తెలిపారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో విజిలెన్స్ ఆధ్యర్యంలో విద్యుత్‌శాఖ అధికారులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో రూ.1.50 లక్షలు విద్యుత్ బకాయిలు వసూలు అయ్యాయన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్‌శాఖ సిబ్బందితో సహకరించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో లైన్‌మన్ వాసం శ్రీధర్‌పటేల్, విజిలెన్స్ కానిస్టేబుల్స్ సతీశ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఘన్‌పూర్ ఏఈ శంకర్